ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా ఎంపీ నామ జన్మదిన వేడుకలు

ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో భారీ స్థాయిలో కేక్ క‌టింగ్‌

1
TMedia (Telugu News) :

 

 

 

 

ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా ఎంపీ నామ జన్మదిన వేడుకలు

నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు

ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో భారీ స్థాయిలో కేక్ క‌టింగ్‌

టీ మీడియా, మార్చి 15,ఖమ్మం:

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్ రావు పుట్టినరోజు వేడుక‌లు మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లావ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎంపీ అభిమానులు, స్థానిక టీఆర్ఎస్ నాయ‌కులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడారు.
రైతాంగం కోసం తన గళాన్ని పార్లమెంట్ లో వినిపిస్తున్నారన్నారని చెప్పారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ… ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్‌స‌భ స‌భ్యుడిగా జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమితికి స‌మ‌న్యాయం చేస్తున్నార‌ని అన్నారు. ఎంపీ నామ త‌న తల్లిదండ్రులు పేరుతో ట్రస్టును  ఏర్పాటు చేసి ఎన్నో ఏండ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  బొమ్మెర రామూర్తి మాట్లాడారు.

Also Read : భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఈవో

నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ..

ఎంపీ నామ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో ఆటో డ్రైవర్లకు స్థానిక పార్టీ నాయకులు ఖాకీ చొక్కాలు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో ఆటో డ్రైవర్లకు, హమాలీలకు నాయకులు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నుండి ఖాకీ చొక్కాలు అందజేశారు. ఖమ్మం రూరల్లో నాయకులు తమ్మినేని కృష్ణయ్య ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు.
ప‌లువురుగ్రీటింగ్‌
దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లు ఎంపీ నామ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని న‌రేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, తెలంగాణ ముఖ్య‌మంత్రి  కేసీఆర్, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, జ‌ర్న‌లిస్టులు,  కార్యకర్తలు ఫోన్, ఇత‌ర సామాజిక మాధ్య‌లైన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్ ద్వారా తెలిపారు.

Also read : భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఈవో

అంగ‌న్వాడీల‌కు చిరు స‌త్కారం

పుట్టినరోజు సంద‌ర్భంగా ఇద్దరు అంగన్వాడీ టీచర్స్ ఈశ్వరి, వసంతల‌ను టీఆర్ఎస్ మహిళా విభాగం తరుపున శాలువా కప్పి ఘ‌నంగా సత్కరించారు.నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరు దివ్యంగులకు ట్రై సైకిల్స్ పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి కనకమేదల సత్యనారాయణ , పార్టీ నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి , రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , కార్పోరేటర్లు బుడిగెం శ్రీను , బుర్రి వెంకటేశ్వర్లు , బొమ్మెర రాంమూర్తి , ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ , బోజెడ్ల రాంమోహన్ , సుడా డైరెక్టర్ కొల్లు పద్మ , దిశా మెంబర్ , ఎన్టీఆర్ పెరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు స్వరూపరాణి , మహిళ సంఘ నాయకురాలు భారతీరాణి , మందా శైలజ , బాణోతు ప్రమీల , కట్టా రాములమ్మ , మేదరమెట్ల ప్రియ , ఎం , సుజాత , ఎం.ప్రమీల , ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు , పగడాల నరేందర్ , గుండ్లపల్లి శేషుకుమార్ , లింగనబోయిన సతీష్ టిఆర్ఎస్ నాయకులు చుంచు విజయ్ , ముల్పూరి శ్రీసు , చిత్తరు సింహాద్రి యాదవ్ , టిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతనిప్పు క్రిష్ణ చైతన్య , తిరుమలాయపాలెం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాషబోయిన వీరన్న , టిఆర్ఎస్ వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు , మర్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పనూతల నాగేశ్వరరావు , సర్పంచుల సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సిరిపురపు స్వప్ప , గోడ్డెటి మాధవరావు , మందపాటి వెంకటేశ్వరరావు , నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్ , చీకటి రాంబాబు , కృష్ణప్రసాద్ , దుద్దుకూరి రాజా , మునిగంటి భార్గవ్ , దోసపాటి కిరణ్ , అమరబోయిన వీరబాబు , గుంటి రాజు తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube