ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

1
TMedia (Telugu News) :

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి
టీ మీడియా, ఏప్రిల్ 12,అశ్వారావుపేట:మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట మహాత్మా జ్యోతిరావు పూలే సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ చల్లా అరుణ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం రావడానికి వందేళ్ళ క్రితమే వర్ణ కుల లింగవివక్షలపై గలమెత్తి పోరాడి ప్రజలను చైతన్య పరిచిన దర్శకుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని,స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబాయ్ పాత్ర గణనీయమైందని, స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన వారిలో ఫూలే అగ్రగణ్యుడు. ఆంక్షల వలయంలో చిక్కుబడి ఉన్న స్త్రీకి అక్షరాలను నేర్పి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించిన ఘనత జ్యోతీబాయ్ ఫూలేకే దక్కుతుంది. స్త్రీల విద్య కోసం 1848లో బాలికా విద్యా పాఠశాలను స్థాపించారు.

also read : సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

మహిళా ఉపాధ్యాయురాలి అవసరాన్ని గుర్తించి తన భార్యకు అక్షరాభ్యాసం చేసి పాఠాలు చెప్పించిన మహోన్నత మూర్తి ఆయన అని. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తింపబడే ఘనతను తన భార్యకు అందించిన సమానత్వ స్థాపకుడాయన అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే సంఘం నాయకులు అంకోలు వెంకటేశ్వరావు,షేక్ ఫకీర్,కైలా శ్రీరాములు,పెనుబోయిన శ్రీనివాస్,తుమ్మ రాంబాబు,దేవరకొండ త్రీనాద్,సోమాని శ్రీనివాసరావు,తెదేపా నాయకులు కట్టం స్వామి దొర, నార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube