భూమిపై రక్షకుడిగా జన్మించిన రక్షకుని జన్మదిన మహోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 25, చర్ల :
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్ల మండల కేంద్రంలో గల బైబిల్ మిషన్ చర్చిలో రక్షకుడిగా జన్మించిన యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా శనివారం ప్రార్ధనలు జరిపారు. ఈ ప్రార్థనలో మందిర సంఘస్తులు, టిఆర్ఎస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు సోయం రాజారావు, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు టీఆర్ఎస్ నాయకులు పాల్గొని మందిరంకు వచ్చిన వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దైవజనులు రెవ.డా,, ఇ యేసుజీవము సర్పంచ్ తో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘస్తులు పూనెం దానియేలు, పిల్లి రమేష్, గాదె కృపామణి, డా,, యోహాను,ఎకుల మహిమ, ఇ సమ్యేల్, యేడెల్ల రాజేంద్రప్రసాద్ మండల బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, రైతుబంధు సమితి చర్ల క్లస్టర్ ఇంచార్జ్ తోటపల్లి మాధవరావు, యూత్ ప్రెసిడెంట్ కాకి అనిల్, మండల నాయకులు గోరెంట్ల వెంకటేశ్వర, వార్డ్ మెంబెర్స్ కట్టం కన్నారవు, పోలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Birthday celebrations of Savior born as Savior on earth.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube