ఘనంగా ఎంపీ నామ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ నామ జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా ఎంపీ నామ జన్మదిన వేడుకలు.

టీ మీడియా ,మార్చి15, మధిర:

టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను మధిర లో మండల,టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మరియు టిఆర్ఎస్ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా వసంతమ్మ సేవా సదనంలో టీ.ఆర్.ఎస్ పార్టీ మధిర టౌన్ & మండల ప్రజాప్రతినిధులతో కలసి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి సేవా సదనం లో మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, మధిర మండల ఎంపీపీ మొండెం లలిత వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, నాయకులు మల్లాది వాసు, మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, చైర్మన్ బిక్కికృష్ణప్రసాద్,మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు డి మాధవి, గద్దల మాధురి, యన్నంసెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, బాహాటం శ్రీనివాస్ రాజు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Also Read : కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube