ఘనంగా శ్రీ పాద జయంతి వేడు
టీ మీడియా, మార్చి 2, పెద్దపల్లి : జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ పాదరావు 85 వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య,శ్రీపాద రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ గా ఆయన చేసిన సేవలు చిరస్మరీయమని మారుమూల ప్రాంతానికి చెందిన శ్రీపాద రావు దేశ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారనీ అన్నారు.
ALSO READ: ఉద్యోగం రావడం లేదని
మంచికి మారుపేరుగా నిత్యం ప్రజల కోసం తపిస్తూ అజాత శత్రువుగా ఉన్నారనీ అన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలను అందించారని అన్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్న మాదుద్దిల్ల శ్రీధర్ బాబు,నాయకత్వములో శ్రీ పాద రావు ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు కల్వల శ్రీనివాస్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్,టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ పేర్క సంతోష్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు పూదరీ చంద్ర శేఖర్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ పి రాజయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు వేముల రాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డు పల్లి జగదీష్,యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం సాయి, తదితరులు పాల్గొన్నారు.