కాన్షీరామ్ 88 వ జయంతి
టీ మీడియా, మార్చి 15 ,దుమ్ముగూడెం:
బహుజన పితామహుడు,భారత రాజ్యాంగ రక్షకుడు,బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరాం 88 వ జయంతి సందర్బంగా బహుజన సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కన్వీనర్ సరియం భీమ్ అధ్యక్షతనలో ములకపాడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి ఇర్పా కామరాజు బి ఎస్ పి భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ విచ్చేసి అంబేడ్కర్ గారికి పూలమాలలు వేసి, కాన్సిరాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి బహుజన నినాదాలతో కేక్ కట్ చేశారు.
Also Read : సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత
ఈ సమావేశ సందర్భంగా రాబోయే కాలంలో బహుజనులదే రాజ్యాధికారం దిశగా తన అత్యున్నత పదవికి స్వచ్చంద పదవి విరమణ ప్రకటించి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మహనీయులు పూలే,అంబేడ్కర్ ల ఆశయాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రమంతా దశల వారి బహుజనరాజ్యాధికార యాత్ర చేస్తున్నారని, అందుకోసం బిసి, ఎస్సీ, ఎస్ టి, ,మైనారిటీలు అందరు బిఎస్పి పార్టీని బలపరిచి దోపిడీ పాలనలనుండి విముక్తి పొందాలన్నారు.
నూతనంగా కొందరిని పార్టీలోకి ఆహ్వానించి,
పొడుతూరి రవీంద్ర ప్రసాద్ , కొప్పుల నారాయణ లకు దుమ్ముగూడెం మండల ప్రధాన కార్యదర్శి , కార్యదర్శి బాధ్యతలను అప్పగించడం జరిగింది
అనంతరం స్వీట్స్,మిఠాయిలు అందజేశారు
ఈ కార్యక్రమంలో బిఎస్పి భద్రాద్రి జిల్లా కార్యదర్శి వీసంపల్లి నరసింహారావు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు చెన్నం నాగరాజు, నియోజకవర్గ ఈసీ మెంబర్ దుమ్ముగూడెం మండల కో కన్వీనర్ కంచర్ల సింహాద్రి , బాబు తదితరులు పాల్గొన్నారు.