అడుగడుగునా బిర్యాని సెంటర్లే.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 31, భద్రాచలం

భద్రాచలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బిర్యాని సెంటర్లు. డిసెంబర్ 31 వస్తుందంటే చాలు పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో బిర్యానీ సెంటర్లు, కేక్ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్థాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులు ప్రత్యేక బిర్యాని, కేక్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ధరలు తగ్గించి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఇలాంటి బిర్యానీ సెంటర్లలో బిర్యాని తిని ఫుడ్ పాయిజన్ అయి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బిర్యానీ, కేక్ సెంటర్ల పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube