బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు

టీ మీడియా, మార్చి 9, పెద్ద శంకరంపేట

1
TMedia (Telugu News) :

బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు

టీ మీడియా, మార్చి 9, పెద్ద శంకరంపేట:

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రైతులను నిరుద్యోగులను మోసం చేస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట మండలంలోని బద్దారం, శివయపల్లి, మక్త లక్ష్మాపూర్ ,కట్టెల వెంకటాపూర్, గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ లో భారీ ఎత్తున చేరినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతలు రాష్ట్ర ప్రజలకు వివరించడానికి బిజెపి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుంటే వారిని ఎలాంటి నోటీసు లేకుండా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం తగదని అన్నారు.కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు కోణం విట్టల్ నాయకులు విశ్వనాథన్ ,సతీష్, పడాల నాగరాజ్, ఆయా గ్రామాల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube