బీజేపీ జాతీయ నాయకత్వం… తెలంగాణపై ఫోకస్ పెంచుతోందా?

బీజేపీ జాతీయ నాయకత్వం... తెలంగాణపై ఫోకస్ పెంచుతోందా?

1
TMedia (Telugu News) :

బీజేపీ జాతీయ నాయకత్వం… తెలంగాణపై ఫోకస్ పెంచుతోందా?

టీ మీడియా,మార్చి 16,హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెంచుతోందా? తెలంగాణలో జాతీయ నేతల వరుస పర్యటనలు దేనికి సంకేతం? గుజరాత్‌కు సమానంగా తెలంగాణపై కమలనాథులు దృష్టి సారించారా? ఇంతకూ తెలంగాణపై బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఇక దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది. దీని కోసం ప్రత్యేక కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ నాయకత్వం ఎలాంటి సాయం అడిగినా చేసేందుకు జాతీయ కమలదళం సిద్ధంగా ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంలో వరుస పర్యటనలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో ముగ్గురు టాప్ లీడర్లు తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా జాతీయ నేతలను తీసుకువచ్చేందుకే రాష్ట్ర నేతలు మొగ్గుచూపుతున్నట్లు తెలియవచ్చింది. ఏ సందర్భంలో ఎవరు రావాలన్నది పూర్తి సమాచారం ఇవ్వాలని జాతీయ నాయకత్వం కోరినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపైనే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలు కసరత్తులు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

Also Read : మహిళ అదృశ్యం పై కేసు నమోదు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube