టీ, మీడియా, అక్టోబర్, 26 పినపాక:
హుజరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం లోని మాదన్నపేట గ్రామంలో గ్రామ ఇన్చార్జీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పున్నం బిక్షపతి మరియు పినపాక మండల అధ్యక్షులు ధూళిపూడి శివ ప్రసాద్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఈటల రాజేందర్ కి అనుకూలంగా ఓట్లు వేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారని టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కుటుంబ పాలనపైన ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని ఈ బై పోలు ఎన్నికల్లో ఈటల రాజేందర్ గ అత్యధిక మెజారిటీతో గెలవ బోతున్నారని ధీమా వ్యక్తంచేశారు .ఈ కార్యక్రమం నందు డాక్టర్ గంగనపల్లి నాగేశ్వర రావు , బూత్ అధ్యక్షులు ఎస్ కే రాజు మహమ్మద్ జైపాల్ పాల్గొన్నారు.