వైద్య సిబ్బందిని సనమనించిన బిజెపి నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్20, వేములవాడ:

కోవిడ్ పరిస్థితుల నుండి మనందరినీ కపాడటానికి మన ప్రధాని తలపెట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ నేటితో 100 కోట్ల డోసులు పూర్తవుతున్న సందర్భంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ చికిత్సతో పాటు వ్యాక్సినేషన్లో పాల్గొన్న వైద్య సిబ్బందికి బుధవారం బిజెపి పట్టణ శాఖ పక్షాన వారిని సన్మానించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆశా వర్కర్లకు, ఎఎన్ఎం లకు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజెపి పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు వివేక్ రెడ్డి, పిన్నింటి హానుమండ్లు, గుడిసె మనోజ్, జనగామ తిరుమల్, రాజశేఖర్ గౌడ్, సాయి,మహేష్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BJP Leaders honor medical personal..
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube