టీ మీడియా, డిసెంబర్ 4,
మంగపేట
మండలం తిమ్మంపేట గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేన పెల్లి నరేందర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని కొనుగోలు తీరును పరిశీలించడాని వెళ్లిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంత కాలం వరి దాన్యంతో పాటు గన్ని బ్యాగులు సూది దబ్బనంతో సహా రైతులకు అందిస్తుంటే టి ఆర్ స్ ప్రభుత్వం గత ఏడు ఏండ్లు గా ధాన్యాన్ని మేమే కొంటున్నామని దొంగ నాటకాలు ఆడరాని నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై తాలు మచ్చ తడిసిన ధాన్యం పేరుతో క్వింటాకి 8 kg ల నుండి 10 kg ల వరకు బలవంతంగా కటింగ్ చేసి భయబ్రాంతులకు గురిచేశారన్నారు వారి నిజస్వరూపం ఇప్పుడు బయట పడిందని.
రైతులు ఇదంతా గమనిస్తూరని ఇప్పటికైనా ధాన్యం సేకరణ తొందరగా యుద్ద ప్రతిపాధికన ఎలాంటి ఆంక్షలు కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ యాకుబ్ పాషా దళిత మైనార్టీ మోర్చా ల జిల్లా ప్రధాన కార్యదర్శి లు గద్దల రఘు సయ్యద్ నాగూల్ మీరా మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీను సీనియర్ నాయకులు దూళిపాల విజయ్ కుమార్ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి కోరేం నారాయణ యువ మోర్చా జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి యువ మోర్చా మండల అధ్యక్షుడు రాంగాని అనిల్ మండల కోశాధికారి గాదె శ్రీనివాస చారి మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్ యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ నాయకులు చిన్నపెళ్లి సమ్మయ్య ఎంగయ్య కొత్నాల కుమార్ బూత్ కమిటీ అధ్యక్షుడు వేల్పుల తిరుపతయ్య బొంబోతుల చంద్రం తదితరులు పాల్గొన్నారు.