బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 30 వనపర్తి : రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి ఆదేశాల మేరకు గురువారం రోజు వనపర్తి పట్టణంలోని జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కెసిఆర్ డిసెంబర్ 31 మధ్యరాత్రి వరకు మద్యం షాపులకు పబ్బులకు అనుమతి ఇవ్వడంతో వాటిని బందు చేయాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్య రాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచడాన్ని మహిళా మోర్చ తరఫున ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం డిసెంబర్ 31 జనవరి లాక్డౌన్ విధించాలి అనుకుంటున్నాడు అందుకు విరుద్ధంగా కేసీఆర్ మద్యం దుకాణాలను తెరవాలని ఆర్డర్ ఇచ్చాడు ఇదెక్కడి విడ్డూరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని దానిని నింపుకోవడం కోసం మద్యం షాపుల విచ్చలవిడిగా రాష్ట్రంలో అనుమతి ఇచ్చారని మరియు డిసెంబర్ 31వరోజు ఎక్కువగా మద్యం షాపుల అనుమతి ఇచ్చాడు.

ఖజానాలు నింపుకోవడం కోసం ప్రజలను తాగుబోతులను చేస్తున్నారు. ప్రజల కుటుంబాలు అగం అవుతున్నాయి యువత పెడదారి పడుతున్నారు. రాత్రివేళలో తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా ఆక్సిడెంట్లకు గురి అవుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, ఇంతటి అనర్ధాలకు కారణమైన మద్యాన్ని ఆయుధంగా ఉపయోగిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. బండి సంజయ్ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం దీక్ష చేపడితే కరోన వ్యాప్తి చెందుతుందని దీక్షలు సభలు నిషేధిస్తూ ఆర్డర్ జారీ చేసాడు.

బిజెపి పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టిన దానిని అడ్డుకున్నాడు మరి మధ్యరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచితే పబ్బులకు ఈవెంట్లకు అనుమతి ఇవ్వడం వల్ల కరోన వ్యాప్తి చెందదా అన్ని అధ్యక్షురాలు కల్పన మండిపడ్డారు. టిఆర్ఎస్ కి ఒక న్యాయం బిజెపి ఒక న్యాయమా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కెసిఆర్ దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం అలవాటైపోయింది. వాటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని వెంటనే మద్యం షాపులు బంద్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కవిత, ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, పద్మ ,మంగమ్మ, కార్యదర్శులు సుగురు లక్ష్మి, సరోజ ,పట్టణ ప్రధాన కార్యదర్శి బండి పుష్ప, చంద్రకళ, రమాదేవి ,శిరీష, బాలీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube