బంగారు తెలంగాణకు దారులు ఇవేనా

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్

1
TMedia (Telugu News) :

బంగారు తెలంగాణకు దారులు ఇవేనా

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్

నర్సింగాపూర్ దళిత కాలనీలో రోడ్లపై నాట్లేసి నిరసన

టీ మీడియా, ఆగస్టు 10, ములుగు జిల్లా బ్యూరో: ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో దళిత కాలనీలలో దారులు నడవలేకుండా అధ్వాన్నంగా మారాయని, బంగారు తెలంగాణ అంటే ఇలాగే ఉంటుందా అని బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ ప్రశ్నించారు. బుధవారం రోజున దళిత కాలనీలో గ్రామస్తులతో కలిసి బురద మయంగా మారిన రోడ్లపై నాట్లేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడారు. రాష్ట్రం సాధించుకుంటే బంగారు తెలంగాణ అవుతుందని మాయమాటలు చెప్పిన కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు. వేలకోట్ల రూపాయల అవినీతి కోసం అవసరం లేని ప్రాజెక్టులకు రీడిజైన్లు చేస్తూ తన కుటుంబాన్ని తరతరాలకు ఇబ్బందులు లేకుండా సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు.

 

Also Read : నేవీ సిబ్బందితో సల్మాన్‌ ఖాన్‌ ఆటా పాటా,వంట

 

దళిత బంధు పేరుతో రోజుకో మాట మారుస్తూ దళితులను మోసం చేస్తున్నాడని, కనీసం నడవలేకుండా మారిన రోడ్లను బాగు చేయలేని సీఎం దగాకోరు, మోసపూరితపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వెంటనే దళిత కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు సైతం ప్రభుత్వానికి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాయడం ఖాయమని ,ప్రతి నిరుపేదకు అభివృద్ధి పథకాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో బిజెపి నర్సింగాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు తక్కల్లపల్లి సుమన్ రావు, నాయకులు చెల్పూరు రవి, కారుపోతుల దేవేందర్, తంగళ్ళపల్లి శ్రీధర్ ,సాగర్, సంతోష్ ,రాజు, సోనా సింగ్, జాటోత్ ధరమ్ సింగ్, గంగుల రాజ్ కుమార్, శరత్ ,కృపాన్వేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube