కేంద్రం ఏం చేసింది కేసీఆర్ ఏం చేశాడో తేలుస్తాం

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ 

1
TMedia (Telugu News) :

కేంద్రం ఏం చేసింది కేసీఆర్ ఏం చేశాడో తేలుస్తాం

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్

ఆర్టిఐ ద్వారా పలు శాఖలకు దరఖాస్తులు

టీ మీడియా, ఆగస్టు 8, ములుగు జిల్లా బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్రం ఏం చేసింది కేసీఆర్ ఏం చేశాడో తేలుస్తామని బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ అన్నారు. సోమవారం రోజున మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారిని కళ్యాణి, మండలంలోని పలు గ్రామాల కార్య దర్శులకు అభివృద్ధి పనుల వివరాలను ఆర్టిఐ ద్వారా తెలుసుకునేందుకు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడారు.

Also Read : సెకండ్ ఏఎన్ఎం మృతి

తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలనతో అప్పుల పాలు చేసిన కేసీఆర్ కేంద్రంపై నిందలు మోపే ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ఎవరెంత ఇచ్చారో తేలిపోతుందన్నారు. ప్రజలు కేసీఆర్ మెడలు వంచే రోజులు దగ్గరపడ్డాయని, బిజెపి పేరు చెబితేనే కెసిఆర్ కు వణుకు పడుతోందన్నారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కారు పోతుల యాదగిరి గౌడ్, జినుకల కృష్ణాకర్ ,మావురపు అనిల్ రెడ్డి ,కారుపోతుల దేవేందర్, మర్రి సాంబయ్య ,తంగళ్ళపల్లి శ్రీధర్ ,రాజు ,శరత్ తదితరులున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube