బిజెపి అధికారంలోకి వస్తుంది

బిజెపి అధికారంలోకి వస్తుంది

1
TMedia (Telugu News) :

బిజెపి అధికారంలోకి వస్తుంది

టీ మీడియా, మార్చి 14, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి వనపర్తి జిల్లా మహిళా మోర్చా ఇన్చార్జ్ యమున పాటాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి జిల్లా మండల స్థాయిలో పూర్తి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని బూత్ స్థాయి నుంచి మహిళా సభ్యులను పటిష్టం చేస్తూ మహిళల భాగస్వామ్యం పెంచుకోవడం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అందుకోసం మోడీ మహిళల హక్కుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను గ్రామస్థాయి నుంచి మహిళలకు వివరిస్తూ భాగస్వామ్యాన్ని పెంచుకుని పూర్తిస్థాయిలో పార్టీ కోసం పని చేస్తూ పార్టీ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందని ఆమె వివరించారు. ఈ సమావేశానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత, అశ్విని, రాధా, సుమిత్ర, శిరీష, బచ్చరాము, రాము, తదితరులు పాల్గొన్నారు.

Also Read : అన్నదానానికి విరాళం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube