రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం

రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం

1
TMedia (Telugu News) :

రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం

టీ మీడియా, మార్చి 20, వనపర్తి : పట్టణంలో బిజెపి పార్టీ కార్యాలయం నందు మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి మహిళా మోర్చా ఇంచార్జ్ యమునా పాటాక్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. మహిళా మోర్చా కోర్ కమిటీని కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా వనపర్తి జిల్లాను మూడు జోన్లుగా విభజించి జోనల్ వైజ్ గా కన్వీనర్ కో కన్వీనర్ నియమించడం జరిగిందన్నారు. ఇకమీదట బూత్ స్థాయి నుంచి పనిచేయడానికి మండలాలకు గ్రామాలకు వెళ్తున్నామని శనివారం ఘణపురం మండలం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పద్మ, ప్రధాన కార్యదర్శి కవిత, ఉపాధ్యక్షులు సుమిత్రమ్మ, పద్మ, మంగమ్మ, లక్ష్మి ,శోభ తదితరులు పాల్గొన్నారు.

Also Read : రోడ్ ప్రమాదాలు నివారించాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube