మోదీకి కృతజ్ఞతలు: బిజెపి నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్19, వేములవాడ:

కరోనా విపత్కర పరిస్థితుల నుండి దేశాన్ని కాపాడుకోడానికి ప్రధాని మోదీ చేసిన కృషి తోనే భారత దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారై, తయారైన వ్యాక్సిన్ నేటితో దేశంలో 100 కోట్ల డోసులు పూర్తి చేసుకొని ఇంకా 130 దేశాలకు ఎగుమతి కావడం సంతోషించ తగిన విషయమని బిజెపి శ్రేణులు మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా ఒకపక్క వ్యాక్సిన్ అందిస్తూనే మరొక అక్క ప్రజలకు ఉచిత రేషన్, ఆత్మ నిర్భర్ ద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం, పీఎం కేర్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్య రంగాన్ని ఆదుకోవడం, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మొదలు ఆరోగ్య సిబ్బందికి పోలీస్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు మొదటి ప్రాధాన్యం ద్వార భారత్ ను విశ్వ గురువు స్థానంలో ఉంచడానికి నిరంతరాయంగ రోజుకు 18 గంటలు పనిచేస్తూ మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న మోదీ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీపీ బండ మల్లేశం,

వేములవాడలో

జిల్లా ప్రధాన కార్యదర్శి
రేగుల మల్లిఖార్జున్, కౌన్సిలర్ బిజెపి పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు , ఎస్సీ మోర్ఛ జిల్లా అధ్యక్షులు సంటి మహేశ్, జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు, కిసాన్ మోర్ఛ జిల్లా అధ్యక్షులు కోల కృష్ణ స్వామి, మహాకాళి శ్రీనివాస్, జింక అనిల్, గడ్డమీద శ్రీనివాస్, సుమంత్ రెడ్డి, హానుమన్డ్లు మనోజ్, బిళ్ల కృష్ణా, సాయి, సంతోష్, రాజు,నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

కొనరావుపెట మండల కేంద్రము లో గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మోత్కు మోహన్, బొల్లారం తిరుపతి, భైరగొని సురేష్, జింక వెంకటి, ఎర్ర రమేష్, ఇస్తారి ప్రవీణ్, చింతల పర్శరాములు, పాక మహేష్, పొన్నం మహేష్, మర్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube