మోదీ ఏ విమానంలో ప్ర‌యాణిస్తున్నారో బీజేపీని అడ‌గాలి

మోదీ ఏ విమానంలో ప్ర‌యాణిస్తున్నారో బీజేపీని అడ‌గాలి

0
TMedia (Telugu News) :

మోదీ ఏ విమానంలో ప్ర‌యాణిస్తున్నారో బీజేపీని అడ‌గాలి

– క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌

టీ మీడియా, డిసెంబర్ 22, బెంగ‌ళూర్ : క‌ర్నాట‌క క‌ర‌వు కోర‌ల్లో అల్లాడుతుంటే సీఎం ల‌గ్జ‌రీ విమానంలో విహ‌రిస్తున్నార‌ని బీజేపీ చేసిన విమ‌ర్శ‌ల‌కు సీఎం సిద్ధ‌రామ‌య్య దీటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎలా ప్ర‌యాణిస్తారో కాషాయ పార్టీని అడ‌గాల‌ని అన్నారు. మోదీ ఏ విమానంలో ఒంట‌రిగా ప్ర‌యాణిస్తార‌ని బీజేపీ స‌భ్యుల‌ను అడ‌గాల‌ని పేర్కొన్నారు. అస‌లు మోదీ ఒంట‌రిగా ఎందుకు ప్ర‌యాణిస్తారో నేరుగా బీజేపీ నేత‌ల‌నే అడ‌గాల‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ నేప‌ధ్యంలో బీజేపీ నేత అమిత్ మాల‌వీయ క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య ల‌గ్జ‌రీ విమానంలో ప్ర‌యాణిస్తున్న వీడియోను ఉద్దేశించి ట్విట్ట‌ర్ వేదికగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : నియంతృత్వ పోకడలతో మోడీ పాలన

క‌రవు స‌హాయ‌క నిధుల‌ను అడిగేందుకు సిద్ధ‌రామ‌య్య త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడితో క‌లిసి ల‌గ్జ‌రీ ప్రైవేట్ విమానంలో ఢిల్లీ వెళ్లారని మాల‌వీయ ఎద్దేవా చేశారు. ఇక ఈ వివాదంపై క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ ముఖ్య‌మంత్రులు ప్రైవేట్ విమానాల్లో ప్ర‌యాణించ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు. అధికారిక ప‌నుల కోసం ప్రైవేట్ విమానాల్లో వెళ్ల‌డం స‌హ‌జ‌మేన‌ని, ఇందులో త‌ప్పేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube