టి మీడియా, నవంబర్ 16, చర్ల :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చర్ల మండల అధ్యక్షుడు గునూరి రమణ, అధ్యక్షుడు సంతపురి సురేష్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పై టిఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగులో కొనుగోలు కేంద్రాల వద్ద పథకం ప్రకారం దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెరాస రౌడీల దాడి లో ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయని, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయకుండా రైతులను కష్టాలకు గురిచేస్తుందన్నారు. ప్రతి గింజా కొంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం పై నెపం వేస్తున్నారని దుయ్యబట్టారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత కేసీఆర్ తెరాస నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, పూటకు ఒక పధకంతో మాయల ఫకీరులా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెరాస కు కౌంట్ డౌన్ మొదలైన దని తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.