టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి : భారతీయ జనతా పార్టీ రూరల్ మండల కార్యవర్గ సమావేశం బుధవారం కంచిరావుపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పెబ్బేరు మండల అధ్యక్షుడు భగవంత యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకాపు మాధవరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ అధికారం కట్టబెట్టిన ప్రజలకు అండగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు వానకాలంలో గాని యాసంగిలో గాని వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటాం అని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం భయాందోళనకు గురి అవుతున్నది. రైతుల పేర్లు చెప్పి నాటకాలాడుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రపంచ దేశాల్లో ఒక ఆదర్శమైన ప్రధానమంత్రిగా పరిగణిస్తూ ఉంటే ముఖ్యమంత్రి టిఆర్ఎస్ నాయకులు దేశ ప్రధాని కించపరిచేలా మాట్లాడుతూ వారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం హీనమైన చర్య దేశ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వ్యాఖ్యలపై వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.
కెసిఆర్ నిరుద్యోగ యువతను పట్టించుకున్న పాపాన పోలేదు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విద్యార్థి యువత తీవ్ర నిరుత్సాహం నిరాశకు గురవుతున్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మూడుసంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదు. ఈ కార్యక్రమంలో బీజేపీ వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు వేమారెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ సర్వేశ్వర్, రఘు,శివారెడ్డి ,రాములు, శివ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube