వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

1
TMedia (Telugu News) :

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

టీ మీడియా, జూలై 16, వనపర్తి బ్యూరో : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళ మోర్చా అధికార ప్రతినిధి కోమారి రోజా రమణి,జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ధుల శశిరేఖ అధ్యక్షతనాతో నియోజకవర్గ స్థాయి మహిళ నాయకురాళ్లతో శనివారం సమవేశమైన నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు,కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సోమశీల సిద్దేశ్వర వంతెన,జాతీయ రహదారి సాధకులు ఎల్లేని సుధాకర్ రావు ఈ సందర్భంగా ఎల్లేని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తు లింగ భేదం లేకుండా సమన్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని మరోసారి గుర్తుచేస్తు. ఉజ్వల యోజన,మహిళల ఆత్మగౌరవ మరుగుదొడ్లు,వడ్డీలేని రుణాలు,మైనారిటీ మహిళ సమాజానికి త్రిబుల్ తాలక్ చట్టం రద్దు.కొండంత ధైర్యాన్ని నింపిన మోడీ ని గౌరవిస్తు స్పష్టంచేశారు.

 

Also Read : జమీర్ జర్నలిస్టుకు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆశ్రునివాళి

కొల్లాపూర్ ప్రస్తుత రాజకీయాల్లో వర్గాల్లో మహిళల పాత్రపై చర్చించి భారతీయ జనతా పార్టీ మహిళ గౌరవాన్ని అందించింది అని నమ్ముతూ నియోజకవర్గ స్థాయి అన్ని మండలాల పూర్తి కమిటీల సమీక్ష జరిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొల్లాపూర్ మహిళ శక్తిని భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించి అఖండ విజయం సాధిస్తామని మాటిచ్చిన మహిళలు.ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు జిల్లా అధికార ప్రతినిధి కాకి హైమావతి గౌడ్,జిల్లా కార్యదర్శి శ్రీ లక్ష్మీ,వనపర్తి జిల్లా కార్యదర్శి సీతమ్మ,కొల్లాపూర్ పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మీ, నియోజకవర్గ పలు మండలాల అధ్యక్షురాళ్లు బీజేపీ జిల్లా,మండల,నాయకురాళ్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube