అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 18 వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ.ఆర్.టి. నెంబర్.372, 2016 రూల్స్ ప్రకారం ఒక రూపాయికే నల్లా కనెక్షన్ పథకం ప్రవేశపెట్టింది. నల్లా కనెక్షన్ లేనివారు ఇంటి టాక్సీ కట్టి నల్లాకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే రూపాయికే నల్ల కలెక్షన్ ఇస్తారు. కానీ మున్సిపల్ సిబ్బంది నల్లా కనెక్షన్ ఇవ్వడానికి 2000 నుంచి 3000 దాకా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే అది అంతే అని డబ్బులు తీసుకొని మళ్లీ ఎవరికైనా చెబితే మీ నల్ల కలెక్షన్ కట్ చేస్తామని మీకు నీళ్లు రావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.ప్రజలు ఏమి చేయలేక డబ్బులు ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకొని మూడు నెలలైనా నల్ల కలెక్షన్ ఇవ్వడం లేదు. అసలే కరోన విపత్కర పరిస్థితులు పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలా డబ్బులు తీసుకోవడం ఏంటి అన్ని ప్రజలు అంటున్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిని మున్సిపల్ కమిషనర్ గుర్తించి వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube