తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

2
TMedia (Telugu News) :

తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

 

టీ మీడియా, నవంబర్ 18, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ అబ్దుల్ సత్తార్ సహాయాసహకారాలతో మంచిర్యాల పట్టణ కేంద్రంలోని కల్వరి యువశక్తి అందశ్రమం నివసిస్తున్న మతిస్థిమితం లేని వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న స్వచ్చంద సేవా సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

Also Read : కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

ఇలాంటి వాళ్ళ మధ్య పుట్టిన రోజు, పెళ్లి రోజుల పంటివి చేసుకోవలన్నారు, వీళ్ళతో కలిసి ఒక్క రోజు గడపడం వలన వీరికి కుటుంబం లేని లోటును కాస్తయినా తీర్చినట్టావుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి వాళ్లకు చేయూతనివ్వాలాన్నారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు ఇస్మాయిల్, తాజ్, ఉమేర్ నావాజ్, రిఫ్ఫత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube