విశాఖ స్టీల్‌లో పేలుడు..
-తొమ్మిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు
టీ మీడియా, ఫిబ్రవరి 11, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు సంబవించి తొమ్మిది మంది కార్మికులు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఎంఎస్-2 లిక్విడ్ స్టీల్ విభాగంలో పేలుడు జరగడంతో నలుగురు స్టీల్‌ప్లాంట్, ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో 70శాతానికిపై శరీరం కాలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గాయపడిన వారిలో ఒక డీజీఎం స్థాయి అధికారి అనిల్ ఉన్నారు. అత్యంత ఉష్ణోగ్రత వద్ద స్టీల్ లిక్విడ్‌ను వేడిచేసి తరలించే లాడెల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనను తెలుసుకున్న ప్లాంట్ ఉన్నతాధికారులు కార్మికులను పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.