ఆశీర్వాదాలు ,పరామర్శలు

మాజీ ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన

1
TMedia (Telugu News) :

ఆశీర్వాదాలు ,పరామర్శలు

మాజీ ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన

టి మీడియా, జూన్ 18,రఘునాధపాలెం:మండలంలో ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించారు. కోయచెలక గ్రామంలో తెల్లబోయిన సోమయ్య కుమార్తె పుష్పలంకరణ, కుమారునికి పంచెకట్టు వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. కటారి బ్రహ్మయ్య కుమారుని అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి, తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఇటీవల మరణించిన చెరుకూరి విశ్వనాధం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేగులచెలక గ్రామంలో ఇటీవల చనిపోయిన అడపా సత్యం, రాచమళ్ల వెంకటేశ్వర్లు, కొర్లపాటి నాగయ్యల కుటుంబ సభ్యులను ఓదార్చి చనిపోయిన వారి చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. పర్యటనలో భాగంగా పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయంను అందజేశారు. పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ దొడ్డా నగేష్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, స్థానిక నాయకులు యండపల్లి జగన్మోహన్ రావు, ఎంపీటీసీ నాగేశ్వరరావు, మాదంశెట్టి హనుమంతరావు, షేక్ ఆరీఫ్, చెరుకూరి భాస్కర్, దంతాల కృష్ణ, కొమ్మినబోయిన గోపి, గోపి యాదవ్, కాముని సామేలు, తోట పెంటయ్య, చెరుకూరి నాగయ్య, చెరుకూరి సీతారాములు, దుంపల రవికుమార్, చింతమళ్ల గురుమూర్తి, సైదులు గౌడ్, గుండెబోయిన నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : వద్దిరాజు కృతజ్ఞత సభ ఏర్పాట్లు పరిశీలించిన తెరాస నాయకులు

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి
కొణిజర్ల : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొణిజర్ల మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అమ్మపాలెంలో షేక్ రంజాన్ సాహేబ్ కుమారుని వివాహ వేడుకకు హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, సర్పంచ్ చిలూకూరి నాగేంద్రమ్మ, ఉప సర్పంచ్ కోసూరి భద్రమ్మ, జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, తాళ్లూరి చిన్నపుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు, షేక్ ఖాదర్ బాబు, గాలిబ్ పాషా, పొట్లపల్లి హుస్సేన్, చావగాని లాలయ్య, సొనగంటి సిరియాల,
కోసూరి నాగ సైదులు, కోసూరి లాల్ కృష్ణ, కొల్లిపాక వెంకటేశ్వర్లు, షేక్ దాదా సాహెబ్, కొనకంచి మోషే, కన్నగంటి రావు, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, ఎంపీటీసీ ప్రసాద్, ఎంపీటీసీ మదన్, సర్పంచ్ మూడు సురేష్, గడల నరేందర్ నాయుడు, బొమ్మగాని నాగేశ్వరరావు, దారగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Also Read : కంచర్ల దయాకర్ కి సన్మానం

పలు శుభకార్యాలలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చింతకాని: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చింతకాని మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రామకృష్ణాపురంలో బుర్ర జయరాజు కుమారుని వివాహ వేడుకకు హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. అదేవిధంగా ఇటీవల గృహప్రవేశం చేసిన కన్నెబోయిన సీతారామయ్య, కన్నెబోయిన రామారావు స్వగృహాలను సందర్శించి అభినందనలు తెలిపారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కిలారు మనోహర్, మాజీ ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, సురేష్, యువజన విభాగం మండల అధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్, సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, ఉప సర్పంచ్ కలకుంట్ల నిర్మల, దేవరపల్లి గాంధీరెడ్డి, గ్రామకార్యదర్శి గుడిపాటి నర్సింహారావు, శెట్టి సురేష్, గద్దల చంటి, సీతారామయ్య, రాయబారపు వీరంజనేయులు, శెట్టి హనుమంతరావు, శెట్టి జనార్థన్, సూదుల రామారావు, కన్నెబోయిన జనార్థన్, కన్నెబోయిన శీను, గుంటి గురువులు, వేల్పుల రాంబాబు తదితరులు ఉన్నారు.

Also Read : రామప్ప దేవాలయం సందర్శించిన విద్యార్థులు

జూలూరుపాడులో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి
జూలూరుపాడు: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూలూరుపాడులో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా సాయిరాం తండాలో హలావత్ రాజ్ కుమార్ భార్య దశదిన కార్యక్రమానికి హాజరైయ్యారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. కాకర్లలో చల్లా తిరుపతయ్య కుమారుని వివాహ వేడుకకు హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూధన్ రావు, లేళ్ల వెంకట్ రెడ్డి, ధారవత్ రాంబాబు, దుద్దుకూరి నర్సింహారావు, కళ్యాణపు నరేష్, చల్లమల నర్సింహారావు, భూక్యా జవహార్, భూక్యా లాలు, లేళ్ల గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube