నల్ల చట్టాలు రద్దులో ఎంపీ నామ పాత్ర…

నల్ల చట్టాలు రద్దులో ఎంపీ నామ పాత్ర...

0
TMedia (Telugu News) :

 

mp nama parlment dharna
mp nama parlment dharna

టీ మీడియా,నవంబర్ 19 న్యూఢిల్లీ బ్యూరో:

దేశంలో రైతాంగం కు తీవ్ర నష్టం చేసే ,పార్లమెంటు లో చట్టం అయిన మూడు బిల్లులు ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విదితమే.. పార్లమెంటు వేలుపుల రైతులు ఆందోళన చేస్తుంటే..లోకసభలో టిఆర్ఎస్ పక్షనేత, ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు పార్లమెంటు ఆవరణలో, చట్ట సభలో అందరి తో మాట్లాడి రైతులు కు మద్దతు గా నిలిచారు. బైట జరిగే పోరాటాలు గొంతుక సభలో వినిపించి అనేక రూపాల్లో కేంద్రం పై వత్తిడి తెచ్చారు..పార్లమెంటు ఆవరణలో టిఆర్ఎస్ ఎంపీ లు చేసిన కార్డులు ప్రదర్శన, గాంధీ విగ్రహం వద్ద ధర్నా దేశవ్యాప్తంగా జరుగుతున్న నూతన వ్యవసాయ చట్టాల వ్యతిరేఖ పోరాటం లకు భరోసా కల్పించాయి. నేడు ఆ పోరాటం లు ఆచట్టాలు ను వెనక్కి తీసుకొనేలా చేసాయి.త్వరలో జరగబోయో శీతాకాల సమావేశాలు లో ఎంపీ నామ నేతృత్వంలో నల్ల చట్టాలు కు వ్యతిరేకంగా 2020 సెప్టెంబర్ 23 న పార్లమెంట్ ఆవరణలో, లోన జరిగిన సీన్ రిపీట్ అయ్యే అవకాశం లు ఉన్న నేపధ్యంలో నే కేంద్రము రద్దు నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

ALSO Read :సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

అప్పటి నుండి దేశ వ్యాపాతంగా నల్ల చట్టాలు కి వ్యతిరేకంగా వామపక్షాలు తో పాటు, టిఆర్ఎస్ లాంటివి కూడా అనివార్యంగా ఉద్యమాల్లోకి వచ్చాయి.మరో వారం రోజుల్లో ఢిల్లీ లో నల్ల చట్టాలకు వ్యతిరేక ఉద్యమం ఆరంభం అయ్యి ఏడాది పూర్తి అవుతుంది.. ఈ ఏడాది లో అనేకపరిణామాలుజరిగాయి.టిఆర్ఎస్ కొంతకాలంగా ఉద్యమాలకు దూరంగా ఉంది.ఆకాలం లో కూడా ఎంపి నామ పార్లమెంటు లో చేసిన ఆందోళన గిరించి ప్రతి పక్షాలు ప్రస్తావన చేసాయి..పార్లమెంటు లో నామ చట్టాల కు వ్యతిరేకంగా మరిసారి గళం విప్పాలి ఆని కోరాయి.అటువంటి అవసరం లేకుండానే ప్రభుత్వం వెనక్కి తగ్గడం లో ఎంపి నామ నాగేశ్వరరావు నాటి పార్లమెంటు లోపల పోరాటం చాలా వరకు దోహద పడింది అనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube