మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న వాల్మీకులు
– ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్
టీ మీడియా, నవంబర్ 29, వనపర్తి బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం వాల్మికి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చి హామిపై ప్రభుత్వం స్పందన లేదని గత 20 రోజులు గా జిల్లా కేంద్రాలలో నిరసన రిలే దీక్షలు చేపడుతున్నామని కానీ మంత్రులు కనీసం స్పందించడం లేదని అందుకు నిరసనగా మంగళవారం మంత్రి నిరంజన్ రెడ్డీ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు గద్వాల పట్టణానికి రావడంతో వాల్మికి నాయకులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకొని వినతి పత్రం సమర్పించారు.మంత్రి వాల్మికి నాయకులతో మట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక బిల్ పెట్టేందుకు కృషీ చేస్తానని నాయకులకు తెలిపారు.గతం లో కేంద్రానికి పంపిన బిల్ పై నాలుగు సంవత్సరాల తరువాత తిరిగి రాష్ట్రానికి పంపిందని,వాల్మికి డిమాండ్ పై ప్రభుత్వం సానుకూలంగా వున్నదని తెలిపారు.
Also Read : కే.సి.ఆర్ దిష్టి బొమ్మ దహనం
వాల్మికి డిమాండ్ పై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని న్యాయం జరిగే విధంగా కృషీ చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డీ నాయకులకు తెలిపారు.అనంతరం వాల్మికి నాయకులు మంత్రికి వినతిపత్రం ఆయనకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెల్డింగ్ రాములు,కోటేశ్, నారాయణ్ రెడ్డీ,నాగ శంకర్,వేణు గోపాల్, శ్యాలప్ప,వేంకటపతి నాయుడు,తోట రాములు, జగదీష్,చిన్న వెంకట రాములు, రాములు, సుధాకర్ నాయుడు,రంగన్న,తిమ్మన్న, జమ్మన్న,భీసాన్న, వెంకటేష్ వాల్మీకి నాయకులు తదితరులు పాల్గొన్నారు.