రక్తదానం మరొకరికి ప్రాణదానం

రక్తదానం మరొకరికి ప్రాణదానం

0
TMedia (Telugu News) :

రక్తదానం మరొకరికి ప్రాణదానం

టీ మీడియా, జూన్ 14, వనపర్తి బ్యూరో : ఆపదలో ఉన్న రక్తం కావాలని ఫోన్ చేసిన స్పందించే వ్యక్తి టీ మీడియా స్టాఫ్ రిపోర్టర్ గంధం రవికుమార్ మంగళవారం రక్తదానం దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఖాజమైనద్దిన్ గంధం రవికుమార్ కు ప్రశంసాపత్రం అందజేశారు.

Also Read : మిషన్ స్మైల్ సంస్థ కి మరో అరుదైన గౌరవం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్త దానం మరొకరికి ప్రాణదానం ఏ నెగటివ్ గ్రూప్ కు చెందిన నేను ఇప్పటికి అత్యవసర పరిస్థితుల్లో కర్నూల్, హైదరాబాద్, వనపర్తి పట్టణంలో దాదాపు పది సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నా రక్తం ఒకేసారి ముగ్గురు ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుంది అంటే ఎంతో సంతోషకరం రక్తాన్ని 18 నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఎవరైనా ఎప్పుడైనా 350 నుంచి 400 మి.లీ్.రక్తాన్ని దానం చేయొచ్చు.

Also Read : రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలి

ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి దానం చేయొచ్చు. ప్రమాదాల్లో గాయపడటం, శాస్త్ర చికిత్సలు, కాన్పు సమయంలో రక్తస్రావం వంటి సందర్భాల్లో అత్యవసరంగా రక్తం ఎక్కించవలసిన వస్తుంది. జబ్బులతో బాధపడేవారికి తరచు రక్తం మార్చాల్సి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడండి. అన్ని దానాలలో కెల్లా రక్త దానం ఇంత గొప్పది రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయండి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube