రక్తదానం చేసిన ఆర్జేసి కళాశాల విద్యార్థులు

రక్తదానం చేసిన ఆర్జేసి కళాశాల విద్యార్థులు

1
TMedia (Telugu News) :

రక్తదానం చేసిన ఆర్జేసి కళాశాల విద్యార్థులు
టీ మీడియా,ఆగస్టు17,ఖమ్మం సిటీ:
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం నిర్వహించిన రక్తదాన శిబిరం లో నగరంలోని ఆర్జేసి విద్యా సంస్థల ఎన్.సి. సి. క్యాడేట్లు పాల్గొని రక్త దానం చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.బి.గౌతమ్,డి.యం.అండ్ హెచ్. ఒ.మాలతి హాజరై రక్త దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయం లో వున్న ప్రాణాన్ని కాపాడ వచ్చు నని అన్నారు.ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Also Read : హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు

 

ఆర్జే సి విద్యా సంస్థల విద్యార్ధులను వారు ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తు లో నూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు ఆపన్న హస్తం అందించాలనిఆకాంక్షించారు.అనంతరం కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు వారు అభినందిస్తూ సర్టిఫికెట్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్. సి. సి.అధికారి నిమ్మల సంపత్ తో పాటు పలువురు అధికారులు తదతరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube