మెగా రక్తదాన శిబిరం విజయవంతం

మెగా రక్తదాన శిబిరం విజయవంతం

1
TMedia (Telugu News) :

మెగా రక్తదాన శిబిరం విజయవంతం

టీ మీడియా, అక్టోబర్ 29, వనపర్తి బ్యూరో : పోలీసు అమరువీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. శిబిరాన్నికి జిల్లా ఎస్పీ అపూర్వరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని, మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 5 నెలల కొకసారి రక్తదానం చేయాలన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా 207 యూనిట్ల రక్తాన్ని సేకరించమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ 22వ సారి రక్తదానం చేశారు.

Also Read : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

డీఎస్పీ ఆనంద్ రెడ్డి 5వ సారి రక్తదానం చేయగా ఎస్సైలు మంజునాథ్ రెడ్డి 17వ సారి, యుగంధర్ రెడ్డి 9వ సారి రక్తదానం చేయగా ఎస్సై రామస్వామి, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube