విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు

విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు

2
TMedia (Telugu News) :

విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు

టీ మీడియా, సెప్టెంబర్ 19, మధిర: హైస్కూల్ విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు మాటూరుపేట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోషణ మాస ఉత్సవాల సందర్భంగా మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ ఊటుకూరు భాస్కర్ రావు ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించి హెమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తెలియపరుస్తూ ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వటం జరిగిందని అన్నారు.

Also Read : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన

ముఖ్యంగా ఆహారం తీసుకున్న తరువాత సీతల పానియాలు, తేనీరు తీసుకోకూడదని తెలుపుతూ అవి తీసుకోవడం వలన పోషకాహారం లోని ఐరన్ క్యాల్షియం ను రక్తంలో కలవనీయక వెంటనే మూత్రం ద్వారా బయటికి పంపిస్తుందని, తద్వారా మీరు పోషకాహారం తీసుకున్న దానివల్ల ఉపయోగం ఉండదని వాటికి దూరం గా ఉండాలని యుక్త వయసు బాలికలకు ఆరోగ్య అవగాహన కల్పించినారు.ఈ కార్యక్రమంలో మాటూరు పిహెచ్సి ల్యాబ్ టెక్నీషియన్ పుతిలి భాయ్ , ఏఎన్ఎం సత్యవాణి, ఆశా కార్యకర్త లక్ష్మి, సృజనకుమారి, అంగన్వాడి టీచర్లు నాగేంద్ర,సునీత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube