పెద్దవాగు లో ప్రమాదవశాత్తు నాటుపడవ బోల్తా

పెద్దవాగు లో ప్రమాదవశాత్తు నాటుపడవ బోల్తా

1
TMedia (Telugu News) :

పెద్దవాగు లో ప్రమాదవశాత్తు నాటుపడవ బోల్తా

టీ మీడియా ,సెప్టెంబర్‌ 23 ,కొమురం భీ౦ జిల్లా :ఇటి వల కురిసిన భారి వర్షాలకు కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ లోని కాగజ్‌నగర్‌ మండలం లో అందవెల్లి గ్రామం లో పెద్దవాగు లో ప్రమాదవశాత్తు నాటుపడవ బోల్తా పడింది.నలుగురు స్కూల్ విద్యార్థులు ,ఇద్దరు కూలిలతో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా ఒక వైపుకు వెళ్లడం తో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థుల బ్యాగులు,కూలీల సెల్ ఫోన్ల్ వాగులో పడిపోయాయి.

Also Read : పలు కుటుంబాలను పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అందవెల్లి పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి ఈ మధ్య కురిసిన భారి వర్షాలకు ప్రమాదకరంగా మారడంతో అధికారులు మార్గాన్ని మూసివేశారు. ప్రమాదం అని తేలిసిన నాటుపడవలో ప్రయాణం చేస్తున్నారు.అక్కడి ప్రజలు విద్యార్థులు ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్న అధికారులు,ప్రజా ప్రతినిధులలో మాత్రం చలనలేదు.ఇకనైనా సమస్యను పరిష్కరించి, పడవ ప్రయాణాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube