ఘనంగా బొడ్రాళ్ళ పునఃప్రతిష్ట

ఘనంగా బొడ్రాళ్ళ పునఃప్రతిష్ట

1
TMedia (Telugu News) :

ఘనంగా బొడ్రాళ్ళ పునఃప్రతిష్ట

టీ మీడియా, జూన్ 23, వనపర్తి బ్యూరో , వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నే గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాళ్ళ పునఃప్రతిష్ట మహోత్సవ పండగ గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి గోపాల్ దీన్నే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి, సహదేవుడు గారి ఆహ్వానం మేరకు పాల్గొన్న.కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.ముందుగా గ్రామ బొడ్రారాయినీ కొబ్బరి కాయ కొట్టి,అనంతరం చెన్నకేశవులు స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు.జగదీశ్వర్ రావు గ్రామంలోనీ పురవీధుల్లో తిరుగుతు గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుందని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వ్యవసాయ రంగం పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందేలా చిన్నకేశవులు స్వామి వారి దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని వేడుకున్నారు.

Also Read : ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నరసింహా రెడ్డి ,వనపర్తి జిల్లా పార్టీ కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ, పాన్గల్ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు జగదీష్ రెడ్డి, పాన్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాఖాపూర్ సుధాకర్ యాదవ్, పుల్గర్ చర్ల రామస్వామి, కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం శివానందం, మల్లేశ్వరం కురుమయ్య, తెల్ల రాళ్ల పల్లి తాండ రామకృష్ణ, మాందాపూర్ రోహిత్ సాగర్ ,గోపాల్ దిన్నె గ్రామం కాంగ్రెస్ నాయకులు సతీష్,సురేందర్ యాదవ్ ,శివ, నరసింహ, వినోద్,హరీష్,గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube