ఘనంగా భోగి సంబరాలు
-పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి
టీ మీడియా,జనవరి 14,పెద్దపల్లి : భోగి సంబరాలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లాలోని పెద్దపల్లి పట్టణం లోని జెండా చౌరస్తా లో భోగిమంటలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెలిగించారు.
గంగిరెద్దుల విన్యాసాలు,హరిదాసుల కీర్తనలు నిర్వహించారు.పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భోగి సంబరాల్లో పాల్గొన్నారు.సంబరాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ లు,మున్సిపల్ అధికారులు,బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.