ఘనంగా భోగి మంటలు

ఘనంగా భోగి మంటలు

0
TMedia (Telugu News) :

ఘనంగా భోగి మంటలు

టీ మీడియా, జనవరి 14, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంగళరావు కాలనీలో పిటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి భోగిమంటల కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని భోగిమంటలు వేస్తూ సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి చలికాచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం చేశారు. అలాగే జంగిడి పురంలో కాలనీ కమిటీ ఆధ్వర్యంలో వేసిన భోగి మంటలు. ఇందులో కాలనీ కౌన్సిలర్ శ్రీధర్ తో పాటు కాలనీ మాజీ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాలనీవాసులతో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Also Read : ఎలాంటి పర్మిషన్ లేకుండా తాటి చెట్ల నరికివేత

ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మాజీ కౌన్సిలర్ జంగిడి బుచ్చన్న, సదానంద గౌడ్, రామన్ గౌడ్ యువకులు శివ, సంతోష్, జంగిడిపురం కాలనీలో కురుమయ్య, మద్దిలేటి, మధుసూదన్, సుధాకర్, సూర్య శేఖర్ రెడ్డి, బాలస్వామి, రామ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆర్కే మూర్తి, వెంకట్రాంరెడ్డి, వెంకటేష్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube