అదుపు తప్పిన బొలెరో వాహనం

ముగ్గురికి గాయాలు

1
TMedia (Telugu News) :

అదుపు తప్పిన బొలెరో వాహనం : ముగ్గురికి గాయాలు
టి మీడియా, ఎప్రిల్ 21, ఏటూరునాగారం :ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలో బొలెరో వాహనం బుధవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వైపుగా వెళ్తున్న ఈ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పడంతో 163వ జాతీయ రహదారి ప్రక్కన ఉన్నటువంటి అడవిలోని చెట్టుకు ఢీకొని ధ్వంసమైంది. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. వారిని 108 వాహనం సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.

Also Read : టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ హత్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube