బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

1
TMedia (Telugu News) :

బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

టీ మీడియా, నవంబర్ 26, పుణె : బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కొన్ని గంటలపాటు బాలగంధర్వ్ రంగమంచ్‌లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పుణెలోని వైకుంఠ సంశన్‌ భూమిలో అయనకు అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అంతకుముందు గురువారమే ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది.

Also Read ; విషాదంలోనూ.. విజేతగా నిలిచిన రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక

అజయ్‌దేవగన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, అలీ గోని, జావెద్‌ జాఫెరీ ట్విటర్‌లో సంతాపం కూడా తెలిపారు.గోఖలే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పలు మరాఠీ, బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. 1990లో అమితాబ్ హీరోగా వచ్చిన అగ్నిపథ్‌, 1999లో సల్మాన్‌, ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా నటించిన హమ్ దిల్‌ దే చుకే సనమ్‌ తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube