తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న బాలీవుడ్‌ నటుడు

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న బాలీవుడ్‌ నటుడు

0
TMedia (Telugu News) :

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న బాలీవుడ్‌ నటుడు

టీ మీడియా, అక్టోబర్ 6, తిరుమల : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్ శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అక్టోబ‌ర్ 6 అనిల్ కపూర్ నిర్మించిన ‘థాంక్యూ ఫర్ క‌మింగ్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Also Read : కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

ఇక బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై థాంక్యూ ఫర్ క‌మింగ్ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్‌, రియా కపూర్, అనిల్ క‌పూర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భూమితో పాటు షెహనాజ్ గిల్, అనిల్ కపూర్, కుషా కపిల, నటాషా రస్తోగి ప్ర‌ధాన పాత్ర‌లు షోషించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube