బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

1
TMedia (Telugu News) :

బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

టీ మీడియా, జూలై 28, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణ కేంద్రంలో జరగబోయే బోనాల పండుగ కి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని హిందూ వాహిని పట్టణ శాఖ అధ్వర్యంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు రోహిత్ మాట్లాడుతూ వనపర్తి పట్టణ కేంద్రంలో కోవిడ్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎవరు కూడా గుడికి పోయే మొక్కి మోక్కులని తీర్చుకుందామని వెళ్ళే ప్రసక్తి లేకుండా భయాందోళనకు గురైన తరుణంలో ఈసారి పెద్ద ఎత్తున్న ప్రజలు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది.

Also Read : మ‌రో ముగ్గురు రాజ్య‌స‌భ ఎంపీలపై స‌స్పెన్ష‌న్‌

అక్కడ ఉన్నటువంటి పోచమ్మ గుడి, కోట మైసమ్మ, జమ్ములమ్మ, జెర్రీపోతుల మసమ్మ, పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచి విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి,భక్తులకు నీటీ సౌకర్యాన్ని, అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి కోడ్లు పొట్టేళ్లను బలి చేయడనికి ఏర్పాట్లు,అమ్మవారు బోనంతో వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేటట్లు కోవిడ్ నిబంధనలతో అన్ని రకాలుగా మున్సిపాలిటీ యంత్రాంగం భద్రత ఏర్పాటు చేయగలరని ప్రభుత్వంన్ని హిందూ వాహిని తరుపున కోరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వాహిని ప్రముక్ చరన్ ,గో ప్రముక్ మూర్తీ కార్యదర్శి రేవంత్ ,వినయ్ , సంతోష్ తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube