ఎస్సీ కాలనీలో వైభవంగా బోనాల పండుగ

బోనాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్న భక్తులు

1
TMedia (Telugu News) :

ఎస్సీ కాలనీలో వైభవంగా బోనాల పండుగ

బోనాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్న భక్తులు

టీ మీడియా, జూలై 20, మహానంది:

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రజలు బోనాల పండుగను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు.ఎస్సీ కాలనీ ప్రజలు సుంకులమ్మ ఆలయంలోని దుర్గమ్మ, మారమ్మ, కుంటెమ్మా, పెద్దమ్మ, అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు.

Also Read : ప్రధాన రహదారి పై అధికారుల నిర్లక్ష్యం

అనంతరం సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇంటింటి నుంచి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం చంటి, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube