పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్
టి మీడియా,జులై 22, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధి 25వ డివిజన్ గోదావరిఖని చంద్రబాబు కాలనీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వం సరఫరా చేసిన నోట్ బుక్స్,పుస్తకాలను పంపిణీ చేశారు. కార్పొరేటర్ నగునూరి సుమలత- రాజు చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… చిన్ననాటి నుండే లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సకాలంలో సర్కారు అందించే సదుపాయాలను అందిపుచ్చుకొని, చదువుకోవాలని పేర్కొన్నారు.
Also Read : లైన్మెన్ పోస్టుల పరీక్షలో గోల్మాల్
చదువుతోపాటు ఇష్టమైన రంగాలలో రాణించేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలని అన్నారు. చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధ్యాయులు వెన్నంటి ఉండాలన్నారు. అలాగే పిల్లల స్థాయిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు వాసవి, కిరణ్ కుమార్, మాధవి, చిన్నారుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube