అవి ప్రభుత్వ స్థలాలు-స్వాధీనం చేసుకోండి

అవి ప్రభుత్వ స్థలాలు-స్వాధీనం చేసుకోండి

1
TMedia (Telugu News) :

 

 

 

 

 

 

 

 

coloctor orders
coloctor orders

అవి ప్రభుత్వ స్థలాలు-స్వాధీనం చేసుకోండి

-అమ్మకం కోసమే ఇంటినెంబర్లు కేటాయింపు

-రెవిన్యూ,మున్సిపల్, రిజిస్టర్ అధికారులు కుమ్మక్కు

కలెక్టర్ ఆదేశాలు తొ బైటపడ్డ అక్రమము

టీ మీడియా,ఫిబ్రవరి 10, మధిర:
ఆ స్థలం ప్రభుత్వానిది,ఇంటి నెంబర్లు కేటాయిపు అక్రమము,రిజిస్టేషన్ కూడా సక్రమం కాదు వెంటనే స్థలాలు స్వాధీనం చేసుకోండి అంటూ కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలు ఇచ్చారు.దీనితో తీగ లాగితే డొంక కదిలిన చందంగా, మున్సిపల్ అస్థి కబ్జాకు మున్సిపల్ అధికారులు సహకారంఅందించగా,రెవిన్యూ,రిజిస్టర్ అధికారులు తల ఒక చెయ్యి వేశారు. పాలేరు,ఖమ్మం నియోజక వర్గాల పరిధిలో ను ఇటువంటి కబ్జా లు ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాలు తో అదే ప్రాంతంలో ని 10 ఇళ్లకు ఇచ్చిన నెంబర్ లు ను ఆన్లైన్ నుండి తొలగించే పనిలోఅధికారులు నిమగ్నం అయ్యారు.

వివరాలు పరిశీలిస్తే..

మున్సిపాలిటీ పరిధిలోని ఎంపిడిఓ కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి మున్సిపల్ అధికారులు గతంలో ఇచ్చిఅనుమతులను మున్సిపల్ అధికారులు తాజాగా రద్దు చేశారు. దీనిపై బిల్డింగ్ యజమానులు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు అక్రమము బైటకు పొక్కింది.
ప్రభుత్వ సిబ్బంది నివాసంలు కోసం మధిర మేజర్ పంచాయతీగాఉన్నప్పుడు1981లో ముగ్గురికి 320 గజాలు మధిర ఎండిఓ కార్యాలయం పక్కన కేటాయించి క్వార్టర్ లు నిర్మాణం చేశారు. ఇదే తరహాలో ఖమ్మం జిల్లా పరిషత్ వెనుక, పాలేరు నియోజకవర్గ పరిధి లోని తిరుమలాయ పాలెం తదితర చోట్ల ఉన్నాయి.ఉచితం గా వారికి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎటువంటి హక్కులు ఇవ్వలేదు.అవి పొందిన వారు అక్కడ ఎటువంటి సొంత నిర్మాణం లు చేయలేదు .అ నివాసాలు తమవి పేర్కొంటూ మున్సిపల్ రికార్డుల్లో అక్కడి వారి సహకారం తో మర్పించు కొన్నారు.ఇంటి నెంబర్ లుపొందారు.వాటి ఆధారం గా రిజిస్టర్ కార్యాలయం లో కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ లు చేసి మున్సిపాలిటీ లో యజమానులు పేర్లు మార్చుకొన్నారు.ఆ అస్థికి ఒక డాక్యుమెంట్లు ఉండడం తో కొత్త జీవో ప్రకారం గత ఏడాది వేరే ఒకరిది ముగ్గురి స్థలం కలిపి అమ్మారు. తిరిగి మున్సిపల్ ము టివేషన్ లు.కొత్త నిర్మాణం కి అనుమతులు వచ్చి పనులు చేపట్టి 90 శాతం పూర్తి.చేశారు.ఈ క్రమంలో కొందరికి లక్షలు ముట్టినట్లు ప్రచారం ఉంది. అది ప్రభుత్వ స్థలం ,అక్రమంగ క్రయ విక్రయాలు జరిగాయని కలెక్టర్ విపి గౌతమ్ కి పిర్యాదు వెళ్లాయి. ఆయన విచారణ చేయించారు.అప్పటికే నిర్మాణ అనుమతు లు రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొనడం, కొనుకొన్న అతను కోర్టుకు వెళ్ల అనడం మొత్తం విష్యం బైటకు పొక్కింది.ఆదేశాలు అందుకొన్న అధికారులు మొత్తం 10 ఇళ్లకు అక్రమంగా ఇంటి నెంబర్ లు కేటాయింపు జరిగింది అని వాటిని ఆన్లైన్ నుండి తొలగించే పనిలో ఉన్నారు.ప్రభుత్వ స్థలం లో అక్రమ నిర్మాణం జరుగుతున్న చూడనట్లు రెవిన్యూ అధికారులు ఉండటం వెనుక రాజకీయ వత్తిడి లునా..కాసుల వ్యవాహారం న అనే చర్చ సాగుతోంది. మధిర తో పాటు ఇతర ప్రాంతాలలో జరిగిన కబ్జాలు గురించి చర్చ సాగుతోంది.కలెక్టర్ చర్యలు పై హర్షం వ్యక్తం అవుతోంది..స్వాధీనం అనంతరం భవనాలు కులుస్తారా..అలానే ఉంచుతారా అన్నది తెలియాలి.మధిర వ్యవహారం అక్రమాల డొంక జిల్లా వ్యాప్తంగా బైటకు రానున్నది.

illigal constrction
illigal constrction
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube