వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

0
TMedia (Telugu News) :

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

టీ మీడియా, ఫిబ్రవరి 21,హైదరాబాద్ : అంబర్ పేటలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు. ఒంటరిగా రావడమే బాలుడు చేసిన పాపమైంది. నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. సెలవు రోజు తండ్రితో కలిసి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయింది. పని చేసే చోటుకు తండ్రి పిల్లలను వెంటపెట్టుకుని వెళ్లాడు.కాసేపు ఆదా మరువడంతో వీధిలోకి వెళ్లిన చిన్నారి కుక్కలకు బలయ్యాడు. తండ్రి పనిలో ఉండటంతో ఒంటరిగా ఉన్న సమయంలో అక్క దగ్గరకు వెళ్లాలనుకున్న చిన్నారి వీధి కుక్కలు వెంటపడటంతో బెదిరిపోయాడు. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి తన శక్తి మేర ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. జంతువును వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిని అన్నివైపుల నుంచి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చాడు. నగరంలోని అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు.

Also Read : వాల్‌నట్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఆదివారం సెలవు కావడంతో గంగాధర్ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ కు వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి, కుమారున్ని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటుూవుండటంతో మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ పని మీద బయటికి వచ్చాడు.అయితే, కాసేపు అక్కడే ఆడుకున్న బాలుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేసి, చంపేశాయి. కాగా, కుక్కల దాడి నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube