బోరుబావిలో పడిన బాలుడు మృతి

బోరుబావిలో పడిన బాలుడు మృతి

1
TMedia (Telugu News) :

బోరుబావిలో పడిన బాలుడు మృతి

టి మీడియా, డిసెంబర్ 10, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ నెల 6న తన్మయ్‌ సాహూ (8) అనే బాలుడు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడిన విషయం తెలిసిందే. 50 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ బాలుడిని రక్షించేందుకు నాలుగురోజులపాటు అధికారులు చేసిన కృషి ఫలించలేదు. బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బోరు బావికి సమాంతరంగా సొరంగం తొవ్వి బాలుడిని బయటకు తీశారు.

Also Read : ఆగిఉన్న లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

అయితే అతడు అప్పటికే ఊపిరివదిలాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు నిర్విరామంగా ప్రయత్నించినప్పటికీ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయామని చెప్పారు. బాలుడి మృతి పట్ల సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంతాపం వ్యక్తంచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube