తప్పుడు ఆరోపణలు చేస్తున్న రియాజ్ అహ్మద్ ను బహిష్కరిస్తున్నాం

జాతీయ సంఘాల నాయకులు

1
TMedia (Telugu News) :

 

తప్పుడు ఆరోపణలు చేస్తున్న రియాజ్ అహ్మద్ ను బహిష్కరిస్తున్నాం

– జాతీయ సంఘాల నాయకులు

టీ మీడియా,సెప్టెంబర్ 23, గోదావరిఖని : సింగరేణి లో నాలుగు జాతీయ సంఘాల నాయకుల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న హెచ్.ఎం.ఎస్ నేత రియాజ్ అహ్మద్ ను సింగరేణి జేఏసీ నుండి బహిష్కరిస్తున్నామని సింగరేణి నాలుగు జాతీయ పర్మినెంట్ కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీ, ఐఎన్టీయుసి, సిఐటియు బిఎంఎస్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్ ప్రసాద్, తుమ్మల రాజారెడ్డి,యాదగిరి సత్తయ్య లు పేర్కొన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో వారు పాల్గొని మాట్లాడుతూ… సింగరేణి లో కార్మికుల సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, హెచ్.ఎం.ఎస్ దివంగత నేత జాడీ దుర్గయ్య జాతీయ సంఘాల తో కలిసి యాజమాన్యం తో కార్మికుల సమస్యల పై జరిగిన చర్చల్లో పాల్గొన్నారని, ఎన్నో అగ్రిమెంట్ లు కూడా చేయడం జరిగిందని వారు తెలిపారు.

Also Read : అనారోగ్యంతో వ్యక్తి మృతి

ప్రస్తుతం ఉన్న హెచ్.ఎం.ఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ జాతీయ సంఘాల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేస్తామని చెపుతూనే, బయట కార్మికుల ను, కార్మిక సంఘాలను బలహీన పరిచే విధంగా తప్పుడు ప్రచారాలను చేస్తూ పబ్బం గడుపు కుంటున్నాడని వారు ఆరోపించారు.అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల్లో దసరా పండుగ వస్తున్నందున సింగరేణి కి 2021-22 ఆర్థిక సంవత్సరం లో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35 శాతం వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, ధర్మపురి,గుండబోయిన భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube