ఘనంగా బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి

ఘనంగా బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి

1
TMedia (Telugu News) :

ఘనంగా బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి

టీ మీడియా, డిసెంబర్ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ మైదానంలో ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 66 వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, సుధా నర్సింగ్ డాక్టర్ శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్. మండ్ల దేవన్న నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ఆనాటి దుస్థితిని గమనించి అంబేద్కర్‌ వారి అభ్యున్నతికి రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించారన్నారు.

Also Read : భారత సరిహద్దుల్లోకి పాక్‌ చొరబాటుదారు

తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసి వారి అభ్యున్నతికి అనుక్షణం పరితపించిన మహనీయులనీ, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన మహౌన్నతమైన వ్యక్తి అంబేద్కర్‌ , అని అన్నారు ఈ కార్యక్రమంలో, కవి పండితుడు గిరి రాజా చారి, విభూది ఈశ్వర్, కొనింటి వెంకటేశ్వర్లు, పరమేశ్వరి చారి, మధు చారి , వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube