బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడి మండల కార్యవర్గం ఏకగ్రీవం

బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడి మండల కార్యవర్గం ఏకగ్రీవం

0
TMedia (Telugu News) :

బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడి మండల కార్యవర్గం ఏకగ్రీవం

టీ మీడియా, జనవరి 5, పెబ్బేరు: బ్రాహ్మణ కుటుంబాల్లోని నిరుపేదలైన బ్రాహ్మణులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందేలా కృషి చేస్తామని వనపర్తి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జోషి గోపిస్వామి తెలిపారు. పెబ్బేరు పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయప్రాంగణంలో గురువారం రాత్రి ఉమ్మడి మండల బ్రాహ్మణ నూతన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మీది వేముల గురురాజాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా గోవర్ధన కృష్ణ ప్రసాద్, కోశాధికారిగా నాయకంటి వెంకటేశ్వర శర్మలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర బ్రాహ్మణ సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా జిల్లా సంఘం సభ్యులు కృషి చేస్తారని తెలిపారు. కొన్ని గ్రామాలలో నేటికీ బ్రాహ్మణులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని, వారికి ప్రభుత్వంతో పాటు బ్రాహ్మణ సంఘ సభ్యులకు కూడా సహాయ సహకారాలు అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా కృషి చేయాలని సంఘం సభ్యులు నూతన కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

Also Read : ఎసిబి కి పట్టుబడ్డ కెయు ఆసిస్టెంట్ రిజిస్టర్

ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం గౌరవ సలహాదారులు ఎత్తం సుధాకర్ శర్మ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వనపర్తి జిల్లా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు పల్లా సాయికుమార్ శర్మ, వనపర్తి జిల్లా బ్రాహ్మణ సమన్వయకర్త భక్షి శ్రీధర్ రావు, వనపర్తి జిల్లా బ్రాహ్మణ సంఘం సీనియర్ సభ్యులు విరివింటి అశోక్ శర్మ, మండల సభ్యులు రాంప్రసాద్, నవీనాచార్యులు, మారుతీ కులకర్ణి, చైతన్య ఆచార్యులు, విజయ్ కుమార్, సురేష్ ఆచార్యులు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube