టీ మీడియా,నవంబర్,23, భద్రాచలం
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చిన్న జీయర్ మఠం,భద్రాచలం లో జరిగింది.ఈ కార్యక్రమం లో సంఘ గౌరవ అధ్యక్షులు శ్రీ పాకాల దుర్గా ప్రసాద్,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ మరియు సీనియర్ పాత్రికేయులు శ్రీ కోనా ఆనంద్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా శ్రీ ఎస్విఆర్ కె ఆచార్యులు,ప్రధాన కార్యదర్శి గా కోవూరు సంతోష్ కుమార్, కోశాధికారిగా పి.వెంకట రమణ మొదలగు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో కిరణ్,వాణి,డివి శంకరరావు,పలివెల సాంబశివరావు,కే నరసింహారావు,జయంత్,కృష్ణ మోహన్,పురుషోత్తం, మురళి,వేణు,గోపాలాచార్యులు,గిరీష్,తేజ,వివిధ మండలాల సభ్యులు పాల్గునోన్నారు.