శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

21 వరకు కొనసాగనున్న ఉత్సవాలు

0
TMedia (Telugu News) :

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

– 21 వరకు కొనసాగనున్న ఉత్సవాలు

లహరి, ఫిబ్రవరి 11, నంద్యాల : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవను భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తామని వివరించారు.

Also Read : వైభవంగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఈనెల 13న దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, 14న ఉదయం శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube